Saturday, May 10, 2008

నాడు...నేడు



నాడు అమ్మ వడిలో వెచ్చదనం
నేడు అఫిసులొ మెడమీద కత్తులు
నాడు దోబుచులాటలు దాగుడుమూతలు
నేడు ప్రాజెక్ట్ లు లక్షాలు వత్తిడులు
నాడు ఆత్మీయతతో కుడిన చల్లని చిరునవ్వు
నేడు పెదవుల మీద మాత్రమె నవ్వు
నాడు ఒంటరితనమె తెలియని ఉమ్మడికుటుంబం
నేడు ఒంటరితనం జడలు విప్పిన భూతంల
నాడు ఆపదలొ మేమున్నమంటు అందరి ఓదర్పు
నేడు ఆపదలొ అందరు మాయం
నాడు అందమైన పూదోటలొ పక్షుల కిలకిలా రావలతో
నేడు డిజిటల్ సౌండ్ జిలుగు వెలుగుల మయాదర్పనం
నాడు అమ్మమ్మ తాతయ్య ల నీతి కథలు
నేడు చాటింగ్ మీటింగ్ డేటింగ్ లు
నాడు ఊరి ఊరి కి చాల దూరం, మనసులు మాత్రం చాల దగ్గర
నేడు ప్రపంచమె ఒక కుగ్రామం కాని మనసులు మాత్రం చాల దూరం
నాటికి నేటికి వున్న సన్నని గీతను చెరిపేద్దమా
నేటి అదునికతతో పాటు నాటి స్వచ్చతను కాపాడు కుందామా

6 comments:

KK said...

మీ ఆలోచనలు బాగున్నాయి. కాని మార్పు అనేది సహజం. దాన్ని జీర్ణించుకోక తప్పదు.


******
విజ్ఞప్తి:- మీరు గూగులోళ్ళు మాత్రమే వ్యాఖ్య ఇచ్చేటట్లు సెట్టింగ్ చేసి ఉన్నారు. మిగిలిన వర్డ్ ప్రెస్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు వ్రాయగలిగేటట్లు వీలైతే మార్చగలరు.

-నువ్వుశెట్టి బ్రదర్స్

arunakiranalu said...

నువ్వుశెట్టి గారు

చాల థాంక్స్ అండి .. ఆ సెట్టింగ్ ఎలా మర్చాలో తెలిటం లేదండి..అరుణ

Puvvaladoruvu said...

మీరు మీ బ్లాగులోకి లాగిన్ అయిన తరువాత, Settings లో comments అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న చాలా ఆప్షన్స్ లో Who can comment? అని ఉంటుంది. దానిలో Anyone అన్నది సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ వివరాలతో మీ సమస్య తీరకపోతే, www.computerera.co.in/chat లోకి రండి ఎవరైనా గైడ్ చేస్తారు.

-నువ్వుశెట్టి బ్రదర్స్

arunakiranalu said...

nuvvu setty garu

set chesanandi

aruna

Bolloju Baba said...

nice poem and good expressions

bollojubaba

arunakiranalu said...

bollojubaba garu

thanks andi