Saturday, May 10, 2008

నాడు...నేడు



నాడు అమ్మ వడిలో వెచ్చదనం
నేడు అఫిసులొ మెడమీద కత్తులు
నాడు దోబుచులాటలు దాగుడుమూతలు
నేడు ప్రాజెక్ట్ లు లక్షాలు వత్తిడులు
నాడు ఆత్మీయతతో కుడిన చల్లని చిరునవ్వు
నేడు పెదవుల మీద మాత్రమె నవ్వు
నాడు ఒంటరితనమె తెలియని ఉమ్మడికుటుంబం
నేడు ఒంటరితనం జడలు విప్పిన భూతంల
నాడు ఆపదలొ మేమున్నమంటు అందరి ఓదర్పు
నేడు ఆపదలొ అందరు మాయం
నాడు అందమైన పూదోటలొ పక్షుల కిలకిలా రావలతో
నేడు డిజిటల్ సౌండ్ జిలుగు వెలుగుల మయాదర్పనం
నాడు అమ్మమ్మ తాతయ్య ల నీతి కథలు
నేడు చాటింగ్ మీటింగ్ డేటింగ్ లు
నాడు ఊరి ఊరి కి చాల దూరం, మనసులు మాత్రం చాల దగ్గర
నేడు ప్రపంచమె ఒక కుగ్రామం కాని మనసులు మాత్రం చాల దూరం
నాటికి నేటికి వున్న సన్నని గీతను చెరిపేద్దమా
నేటి అదునికతతో పాటు నాటి స్వచ్చతను కాపాడు కుందామా

Monday, April 28, 2008

raava kanipinchava


నీలిమెఘాల మాటున దాగిన ఓ చందమామా

రావా కనిపించవా, ఎందుకురా నీకు అలక
నేను ఏమన్నాని
నీవు కనిపించ లేదు నా వెంట రాలేదనేగా కసిరా

అందుకే ఇంత అలకానీ మీద ప్రేమతోనె గ అన్నా

అలక మాని కనిపించవా

ఈ రేయీ చేజారి పోనియకు రా

నీ వెన్నెల వెలుగులొ నీతో చేరి

ఎన్నో ఉసులు చెప్పాలనుకొన్న నా గుండె సవ్వడి
చక్కని చుక్కల మద్య నున్న నీకు వినిపించదా ప్రియా

Monday, March 10, 2008

ఎందుకు భయం







స్వప్న సౌదలని సాదించలంటే కావలసింది ఆత్మస్తైర్యం
నీవు నిన్నటిని చూసావు

నేటిని చూస్తున్నావు

మరి రేపటి గురించి ఎందుకు భయం

పిరికి వారికి చరిత్రలొ స్థానం లేదు

స్వప్న కిరీటలు సాహసవంతుల సొంతం

Wednesday, February 27, 2008

అరుణ
ఈ అరుణ మనసులో ఉదయించే ఆలోచనల ఊహాల కిరణాలను మీతో పంచుకోనె చిన్ని ప్రయత్నమే ఈ అరుణ కిరణం.. అక్షర ధోషాలుంటే మన్నించగలరు.