Saturday, May 10, 2008

నాడు...నేడు



నాడు అమ్మ వడిలో వెచ్చదనం
నేడు అఫిసులొ మెడమీద కత్తులు
నాడు దోబుచులాటలు దాగుడుమూతలు
నేడు ప్రాజెక్ట్ లు లక్షాలు వత్తిడులు
నాడు ఆత్మీయతతో కుడిన చల్లని చిరునవ్వు
నేడు పెదవుల మీద మాత్రమె నవ్వు
నాడు ఒంటరితనమె తెలియని ఉమ్మడికుటుంబం
నేడు ఒంటరితనం జడలు విప్పిన భూతంల
నాడు ఆపదలొ మేమున్నమంటు అందరి ఓదర్పు
నేడు ఆపదలొ అందరు మాయం
నాడు అందమైన పూదోటలొ పక్షుల కిలకిలా రావలతో
నేడు డిజిటల్ సౌండ్ జిలుగు వెలుగుల మయాదర్పనం
నాడు అమ్మమ్మ తాతయ్య ల నీతి కథలు
నేడు చాటింగ్ మీటింగ్ డేటింగ్ లు
నాడు ఊరి ఊరి కి చాల దూరం, మనసులు మాత్రం చాల దగ్గర
నేడు ప్రపంచమె ఒక కుగ్రామం కాని మనసులు మాత్రం చాల దూరం
నాటికి నేటికి వున్న సన్నని గీతను చెరిపేద్దమా
నేటి అదునికతతో పాటు నాటి స్వచ్చతను కాపాడు కుందామా